Tuesday, December 30, 2008

మెడికల్ టెస్టులు నో ఫ్రీ @ "ఆరోగ్య శ్రీ"!

# వైద్య పరీక్షలకు డబ్బు వసూళ్లు

Medical Tests no free @Arogyasri!!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29:
ఆరోగ్యశ్రీ పథకంలోని నిబంధనలతో రోగులు, వారి బంధువులు బేజారవుతున్నారు. ఆ పథకంలో ఉన్న నిబంధలనలు ఆస రాగా చేసుకున్న కార్పొరేట్‌ ఆస్పత్రులుఅందినకాడికి డబ్బులు దండుకుంటున్నాయి. `అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం' ఇదీ ఆరోగ్య శ్రీనినాదం. కానీ ఇందులో ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరీ‚క్షలు ఏ మాత్రం ఉచితంగా జరగడం లేదు. ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ ఇవ్వకపోవడం, ఆదాయ పరిమితి పెంచాక గులాబీ కార్డులను తెలుపు కార్డులుగా మార్చడంలో కొనసాగుతు న్న జాప్యం.. ఇవన్నీ ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల నుంచి డబ్బు గుంజడానికి దోహదపడుతున్నాయి. పథకం అన్ని జిల్లాలకు విస్తరించాక ఇటీవలి కాలంలో `ప్రీ‚ ఆథరైజేషన్‌' సమస్యలు పెరిగాయి.

అనుమతుల్లో తప్పని జాప్యం

హఠాత్తుగా తలెత్తున్న ఆరోగ్య సమస్యలకు సత్వర వైద్య సేవలు అందాలి. అందుకు భిన్నంగా ఆరోగ్య శ్రీ పరిధిలో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఎవరైనా వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించాలంటే అనుమ తుల కోసం ఆంబులెన్సుతో సహా సీఎం క్యాంప్‌ కార్యాల యానికి వెళ్ళాలా? అంటే అధికారుల నుంచి అవుననే జవా బులే వినిపిస్తున్నాయి. తెలుపు రేషన్‌ కార్డుండి, ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే ఎవరికైనా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. న్యూరోసర్జరీ, హార్‌‌ట స్ట్రోక్‌, మె దడు సమస్యలు, ప్రమాదాల్లో తీవ్రగాయాలు వంటి అత్యవసర కేసులక్కూడా ఇవే సమస్యలు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఏ రోగినైనా ఆసుపత్రిలో చేర్చు కోవాలంటే ట్రస్‌‌టలోని డాక్టర్లు ప్రీఆథరైజేషన్‌ అనుమతులు ఇవ్వాలి. తెలుపురేషన్‌ కార్డున్నా తమకు చికిత్స మొదలు పెట్టాలంటూ సీఎం క్యాంప్‌ కార్యాలయ ఆవరణలోని ఆరోగ్య శ్రీ కౌంటరుకు పరిగెత్తాలి. ఒక్కోసారి ఇలా చికిత్స కు అనుమతులు (ప్రీఆథరైజేషన్‌) తీసుకునేందుకు రెండు, మూడు రోజులు పడుతోంది. అప్పటి వరకు చికిత్సఆపితే రోగి ప్రాణాలకే ముప్పు. కానీ వారు నిజమైన లబ్ధిదారులైనా సరే ఈ నరకయాతన తప్పదు. అప్పట వరకు అయ్యే మెడికల్‌ టెస్టులు, చికిత్సకయ్యే మొత్తం ఖర్చులు రోగి బంధువులే చెల్లించాలి. ఆరోగ్య శ్రీ ఉందనుకొని డబ్బు లేకుండా కార్పొరేట్‌ హాస్పిటల్‌ గుమ్మమెక్కితే వైద్య పరీక్షల ఖర్చు లే తడిసి మోపెడవుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో నాలుగైదు మెడికల్‌ టెస్టులు, వసతి, మందులు, సెలైన్ల ఖర్చులు, ఆంబులెన్‌‌స, సర్వీస్‌చార్జీలకే రూ.25 వేలపైన ఖర్చవుతున్న సందర్భాలూ ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి లో సమస్య లు ఇలా ఉంటే ఇక `ఆన్‌లైన్‌ అనుమతులు... ఆలస్యమే లేదు' అనే ఆమాత్యుల ప్రకటనలు అర్థమేమిటి?!

పరిధిలో ఉన్నా మెలికలు!

ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లకే డబ్బు, అవి లేకుంటే లేదు అన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్నికేసులు ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నా అన్ని సమయాల్లో ఆపరేషన్‌ అవసరమవదు. మైల్‌‌డ హార్‌‌టస్ట్రోక్‌, కిడ్నీ మార్పిడి, కేన్సర్‌ తదితర కేసుల్లో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తరహా కేసుల్లో ఆపరేషన్‌ అయితేనే ఆరోగ్యశ్రీ పథకం నుంచి నిధులు మంజూరవుతాయి. ఆప రేషన్‌ జరుగని పరిస్థితుల్లో రోగుల బంధువులే తమ జేబు నుంచి వైద్య సేవల పూర్తి ఖర్చులు భరించక తప్పదు. ఇటువంటి సమ స్యలు ఎదురవుతాయని అనిపిస్తే ప్రైవేటు వైద్య పరీక్షలకు ముందుగా డబ్బు చెల్లించేందుకు అంగీకరిస్తేనే చికిత్సకు చేర్చుకుంటామని మెలికపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మెడికల్‌ టెస్టులు చెల్లించేందుకు సైతండబ్బు లేని పేద వారిగా కనిపిస్తే హాస్పిటల్‌ చేర్చుకునేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఈ సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావిస్తే... వైద్య పరీక్షలు, మందులు, ఆపరేషన్‌ జరిగాక అవసరమయ్యే చెకప్‌లు, వైద్య సేవలు అన్నీ ఉచితమేనని పాత జవాబులే వినిపిస్తున్నాయి. ఏవైనా ఇబ్బందులెదురైతే ట్రస్‌‌ట ఆఫీసులో లేదా టోల్‌ ఫ్రీ నెంబరుకు డయల్‌ చేసి ఫిర్యాదు చేయా లని సరిపెట్టేస్తున్నారు.కానీ ప్రజల్లో వీటిపై అవగాహన పెంచేందుకు ఎటువంటి చర్యలూ తీసు కోవడం లేదు. ప్రీ ఆథరైజేషన్‌ను మరింత వేగవంతం చేయడం, ఈ పథకం పరిధిలోని సమస్యలకు ఆపరేషన్‌ అవసరమున్నా..లేకు న్నా ఉచిత చికిత్స, అత్యవసర వైద్యం అవసరమైన సంద ర్భాల్లో మామూలు నిబంధనల నుంచి మినహాయింపు వంటి మార్పులు చేపడితే తప్ప ఆరోగ్య శ్రీ పనితీరు మరింత మెరుగుపడదు.

No comments:

Post a Comment