Friday, December 26, 2008

ఈ రోగికి దిక్కెవరు?

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25:
188 వసంతాల ఘనచరిత్ర ఉస్మానియా ఆసుపత్రి సొంతం...అందుకే పర్యాటక శాఖ ఆ భవన సముదాయాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. కానీ ఇన్ని సంవత్సరాల్లో కార్పొరేట్ స్థాయికి వెళ్ళాల్సిన వైద్య ప్రమాణాలు ఆ ఆసుపత్రిలో పూర్తిగా భ్రష్టు పట్టాయని చెప్పక తప్పదు!!
వెలుపలి నుంచి చూస్తే ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిజాం నిర్మాణ నైపుణ్యంతో వైభవాన్ని సంతరించుకుని దర్పంగా కనిపిస్తాయి. లోపల మాత్రం రోగులు తమను పట్టించుకునేదెవరని దీనంగా చూస్తుంటారు. నిజాం సంస్థానం ఐదవ రాజైన అసఫ్‌ జాహీ రాచ కుటుంబీకులు, బ్రిటీష్‌ అధికారులు, ఉన్నతాధికారులు, నగరం లోని సంపన్నులకు ఒకప్పుడు వైద్య సేవలం దించిన ఆస్పత్రి అది. ప్రారంభించిన తొలి నాళ్లలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా ఇక్కడికే వచ్చే వారు. కాలక్రమంలో వైద్యరంగంలో కార్పొరేటీకరణ, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం...తదితర కార ణాలతో నిరుపేదలు, అనాథలకు మాత్రమే ఉస్మా నియా పరిమితమైంది. వైద్యవిద్య మంత్రి గల్లా అరుణ కుమారి పూర్తిగా ఆరోగ్య శ్రీ సేవలో బిజీగా ఉండడంతో టీచింగ్‌ ఆస్పత్రి అయిన ఉస్మానియాను పట్టించుకునేవారే కరువ య్యారు. ఆస్పత్రి లోపలికి అడుగుపెడితే కానీ తెలీదు... అదో మునిసిపల్‌ డంపింగ్‌ యార్డని. కారిడార్‌ లోంచి కర్చీఫ్‌ ముక్కున అదిమిపెట్టుకుని వెళుతున్నా ఉక్కిరిబిక్కిరి చేసే దుర్గం ధంతో శ్వాస పీల్చడం కష్టమవుతుంది. `రావడం మొదటి సారా... అయితే కష్టమే! నిదానంగా అదే అలవాటవు తుంది' అనేస్తారక్కడి రోగులు. ఇంతవరకైతే పర్లేదు... ఔట్‌ పేషెంట్‌ దశ నుంచి ఆపరేషన్‌, డిశ్చార్‌‌జ ఇలా అన్ని దశల్లో సహనానికి రోగులకు పరీక్షలెదురవుతాయి. `ఇలా ఎంతవరకు? ఎంతకాలం?! 'అని ప్రశ్నిస్తే... `సర్కారు దవాఖానాలో తప్పదు సారూ!... సర్దుకుపోవాలె!' అనే జవాబు వస్తుంది!!

*****
సాయంత్రం ఆరు దాటుతోంది. చలి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరు కుంటున్నాయి. కానీ రాత్రికి తామెక్కడ తలదాచుకోవాలో ఆ కుటుంబానికి దిక్కుతోచలేదు. కడుపులో పుండైన తండ్రిని ఉస్మానియాలో చేర్పించాలని వారు ఆదిలాబాద్‌ నుంచి ప్రయాసపడి రాజధానికి చేరుకున్నారు. డాక్టర్ల కోసం ఉదయం నుంచి ఔట్‌ పేషెంట్ల క్యూలో నిలబడే ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఎదురు చూసినా వారి వంతు రాలేదు.డాక్టర్ల డ్యూటీ అయిపోయింది... ప్రైవేటు ప్రాక్టీసు కెళ్ళిపొయారు. ఇక చేసేదేంలేదు... మళ్ళీ రేపే!! చాలా సేపటి వరకు తర్జనభర్జనలు పడ్డారు. చివరికి సెక్యూరిటీ దయాదాక్షిణ్యాలతో ఉస్మానియాలోని కులీకుతుబ్‌ షా భవనం ముందు ఖాళీ జాగాలో చెట్ల కింద పడుకునేందుకు సిద్ధమయ్యారు. 188 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల దుస్థితికిదో మచ్చుతునక.
*****
కరెంట్‌ షాక్‌ తగిలి ఒళ్లంతా కాలిపోవడంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన పాండును 3 నెలల కిత్రం బర్‌‌న వార్డులో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఈయన సంరక్షణకు వచ్చిన భార్య, మామకు మూడు నెలలుగా బర్‌‌న వార్డు బయట మెట్ల మీదే నివాసం. రోగుల అటెండెంట్‌‌స కోసం కేటా యించిన షెడ్‌లో నీళ్లు, చెత్తా చెదారం పేరుపోవడం వల్ల దోమలు సై్వరవిహారం చేస్తున్నాయి. దుర్గంధం ప్రబల డంతో ఇక్కడ ఉండేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు.నిత్యం నాలుగువేల మంది తిరిగేస్థలంలో... నాలుగు భవనాలున్న చోట ఆస్పత్రిలో చేరిన రోగుల బంధువులు, దూరƒ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఉండేందుకు కూడా కనీసవసతి సౌకర్యాలు కల్పించకపోవడం దారు ణం. వజ్రోత్సవాలు దాటిన చరిత్ర ఘనమే... కానీ ఇక్కడ రోగుల స్థితి అత్యంత దయనీయం. *****
కడుపునొప్పి తీవ్రంగా ఉండ డంతో భాగవతమ్మ (45)ను నల్గొండ జిల్లా నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరి ఓపీ అడ్మిషన్‌ జరిగేసరికే మధ్యాహ్నం 12గంటలు దాటింది. నొప్పి తీవ్రత తగ్గ ƒపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా సెలైన్‌ పెట్టారు. స్టెచర్‌‌స లేకపోవడంతో సెలైన్‌తో సహా ఆమెను నేల మీదే వదిలేశారు. సాయంత్రం 3 దాటినా డాక్టర్ల అతీగతీ లేదు. పల్లె టూరి నుంచి వచ్చిన ఆ పేదరాలికి తెలీదు...మధ్యాహ్నం రెండు దాటితే డాక్టర్లె వరూ ఉండరని!! ఎవరో ఒకరు రాకపోతారా? తన బాధ చూడకపోతారా! అన్న ఆశతో అలసి మూగన్నుగా నిద్ర పడుతున్నా... ఆమె కళ్లు అడపాదడపా పత్తికా యల్లా విచ్చుకుంటున్నాయి.
*****
వీళ్ల కుటుంబాలే కాదు... 27 ఎకరాల సువిశాల ఉస్మా నియా ప్రాంగణంలో ఇలా అరుగుల మీద, ఆరుబయట రోజులు వెళ్లబుచ్చే రోగులు, వారి సహాయకులు చాలా మందే ఉన్నా రు. ఇది ఒక్కరిపరిస్థితి కాదు.. నేల ఈనినట్లు ఆస్పత్రిలో 4 భవన పరిసరాల్లో ఎక్కడ చూసినా దిక్కూ మొక్కూలేనిజనం.రోగులతో పాటు వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేం దుకు ఓ చిన్న షెడ్డుంది. ఎక్కువలో ఎక్కువ 25 మందికి సరిపోతుంది. అందులో సగం వంట శాలకిచ్చే శారు. ఈ సమస్యలు తెలిశాయే మో... ఉస్మానియాలో రోగుల సహాయకులకు రోజువారీ అద్దెతో గదులిచ్చేందుకు ఓ ధార్మిక సంస్థ ముందుకొచ్చింది. ఆస్పత్రి పక్కనే ఉన్న `రామనాథ్‌ ఆశ్రమం'లో రోగుల సహాయకులకు రోజుకు రూ.20-40వరకు తీసుకుని గది అద్దెకిస్తున్నారు. కానీ ఈ స్తోమత కూడా లేని వాళ్లు, ఆ డబ్బుతో ఒకరోజు భోజనం ఖర్చులు వెళ్లదీసేందుకు... ఎండకు ఎండినా, వానకు తడిసినా, చలికి వణికినా ఆస్పత్రి ఆవర ణలోనే బస చేస్తున్నారు. రోగులు, వారి సహాయకులు కలిపి రోజుకు సమారు ఐదు వేల మంది వచ్చే నాలుగు సువిశాల భవనా లున్న టీచింగ్‌ ఆస్పత్రిలో మౌలిక వసతుల లేమికిది పరాకాష్ట. రోజుకు కనీసం 300 మంది ఇలా ఆశ్రయం లేక ఆస్పత్రి పరిసరాల్లో చెట్లకింద, కారి డార్లు, మెట్లమీద.... ఇలా ఎక్కడో ఓ చోట కాలం వెళ్లదీస్తున్నారు.



రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే
ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్‌‌జ అయ్యే వరకు ప్రతీ అంకంలోనూ రోగులు, వారి బంధువుల సహనానికి అనునిత్యం పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ చికిత్స కోసం చేరితే రోగులు బయటకొచ్చేందుకు చాలా కాలమే పడుతుంది. న్యూరో సర్జరీ కోసం నెల్లూరు నుంచి వచ్చిన శీనుకు ఆపరేషన్‌ చేయాలని చెప్పి నెల దాటిపో యింది. ఇందుకు రెండు విభాగాల స్పెషలిస్టులుండాలి. అనస్తీషియా, న్యూరో విభాగాల నిపుణులకు టైం కుదరక ఆపరేషన్‌ పలుమార్లు వాయిదా పడింది. ఆపరేషన్‌ అన్న ప్రతీసారీ అన్ని రకాల టెస్టులూ చేయాల్సిందే. నల్గొండలో చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసే అతని తండ్రి ఆస్పత్రి ఖర్చులు, మెడికల్‌ టెస్టుల కోసం ఇప్పటికే అప్పు చేశాడు. ఆపరేషన్‌కు దాచుకున్న డబ్బు ఆ సమయానికి కరిగిపోతే పరిస్థితిటేమిటన్న అనుమానాలు పీడిస్తున్నాయి. గవర్న మెంటు ఆస్పత్రి కదా... ఫైలుతో పాటు చికిత్సా ఆలస్య మవుతుంది. రూల్సు, టెస్టులు, సిబ్బంది లంచాలు ఇలా అన్నీ ఎక్కువే.అంతా ప్రొసీజర్‌ ప్రకారమే పోతారు.. ప్రభుత్వ నౌకరీలు కదా... ఆ మాత్రం జాగ్రత్తలు అవస రమే అంటారు. టెస్టుల కోసం వారం తరువాత రమ్మం టారు. చిన్నపాటి ఆపరేషన్‌కు ఎన్నాళ్లు తిప్పించుకుంటారో ఎవరికీ తెలీదు. దీంతో రోగుల కుటుంబాలకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
నిర్లక్ష్యానికి ఫలితమే ఈ దుస్థితి
అధికారుల అలసత్వం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఉస్మాని యాలో రోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాక, ఇక్కడి పరిస్థితులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఓ ఉద్యోగి వాపోయారు.

No comments:

Post a Comment