Thursday, August 6, 2009

ద్వేషమా..? ప్రేమా..?

ద్వేషం..?!
.
.
ప్రేమంది... వెంట తిరిగింది
...
కొన్నాళ్లకు...
వెంట తిప్పుకుంది..
చిత్రం..! కాదంది...
ప్రేమించలేదంది..
కసిరింది... కట్‌ చేసింది
గుండెలపై గుద్దినట్లనిపించింది..
కొడవలితో కోసిన బాధ
సమ్మెటతో మోదిన భావన
కలా?!... నిజమా..?!
మళ్ళీ వేరొకరితో షురూ...
.
.
మనసు గాయపడింది
బతుకు వ్యర్థమనిపించింది
తప్పెవరిదని మనసు పీకింది
ఎందుకిలా జరిగిందని..
ప్రశ్నల... గుండె నీళ్ల... కళ్ల నీళ్ల...
ఊట ఉబికింది
చేతకానితనానికి సంకేతాలా?!
.
.
ఏం చేయాలిప్పుడు...?!
వేధింపులా..? సాధింపులా..?.. ఎత్తిపొడుపులా..?!
ఏం చేస్తే ఈ కసి తీరుతుంది...
చివరికి దాడులా?!
కత్తులా... యాసిడా..?!
.
.
స్వప్నిక గుర్తొచ్చింది..
శ్రీలక్ష్మి బేల చూపులు తడిమాయి
సమీర వేలెత్తి చూపింది..
...
తప్పు ఇద్దరిలోనూ ఉందనిపించింది..
గుర్తొచ్చింది...
తను దేవత కాదని..
నేను మనిషినని..
...
వెన్నెల కురిపించలేక...
మల్లెలు దోసిళ్లతో కుమ్మరించలేక..
చేతకాక..
నిప్పులు కుమ్మరిస్తానా..?!
బతుకులు ఛిద్రం చేస్తానా..?!
.
.
చివరికిది...
ద్వేషమా..? ప్రేమా..?

Wednesday, August 5, 2009