Friday, January 16, 2009

'పొగపై నిషేధం' గాల్లో కలిసింది!

* బడ్జెట్ లేక ఇబ్బందులు
* చట్టం అమలులో కానరాని పురోగతి

హైదరాబాద్‌, జనవరి 6:
బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధం అమలు నత్తనడకన సాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసు క్యాంపస్‌లలో తప్పించి రోడ్లు, బస్టాపులు, ఫాస్‌‌టఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు, టీస్టాల్‌‌స, ఎక్కువ జనసమర్థం ఉండే చోట్ల ఈ చట్టం అమలు కావడం లేదు. చట్ట ఉల్లం`ఘను'లపై చలాన్లు రాసి జరిమానా విధించడంలో సరైన శిక్షణ, అలవాటు లేక పోవడంతో పోలీసు, ఔషధ నియంత్రణ శాఖలు మినహా మిగిలిన వైద్య ఆరోగ్య శాఖ విభాగాలు పూర్తిగా వెనుక బడ్డాయి. విద్యా సంస్థలు, కాలేజీలు, యూనివర్శిటీ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయం చట్టరీత్యా నేరమె నప్పటికీ ఈ చట్టం అమలు మొదలైన ఈ మూడు నెలల్లో పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక్క కేసూ నమోదు కాలేదు!. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగ డంపై నిషేధం అమలులోకి వచ్చి మూడు నెలలు గడిచాయి. గత ఏడాది గాంధీ జయంతిన మొదƒ లైన ఈ కార్యక్రమాన్ని `పొగ బాబులు' తప్ప అందరూ హర్షిం చారు. ఇకపై బయట పొగ ఉధృతితో ఉక్కిరిబిక్కిరవడం తగ్గుతుందని ఆశించారు.కానీ ఈ చట్టం అమలులో ప్రభుత్వం శ్రద్ధ కనబరచకపోవడంతో తగి నంత పురోగతి సాధ్యపడలేదు. తమిళనాడు, చండీగఢ్‌తో సహా పలు రాషా్టల్రు ఈ చట్టం అమలులో ముందుకు దూసుకుపోతున్నాయి. ఆంధ్రప్ర దేశ్‌ మాత్రం పొగపై నిషేధంలో మూడవ స్థానంతోనే సరి పెట్టుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పొగపై నిషేధం అమలుకు తగిన బడ్జెట్‌ కేటాయించకపోవడంతో సమ స్యలు ఎదురవుతున్నాయి. ఈ చట్టం అమలుపై ప్రతీ మూడు నెలలకోసారి పూర్తి వివరాలతో హైకోర్టుకు, కేంద్రా నికి నివేదిక సమర్పించాలి. పొగపై నిషేధం సీరియస్‌గా తీసుకోని రాషా్టల్రకు కేంద్రం నుంచి లేఖల రూపంలో ఇప్ప టికే అక్షింతలు పడ్డాయి.

బడ్జెట్‌ ఏదీ?!

చాలా ప్రభుత్వ శాఖలు జరిమానా విధించేందుకు చలాన్‌ బుక్‌లు లేవు. ప్రచారానికి అవసరమైన పోస్టర్లు, బ్యానర్లు, చట్టం పుస్తకాల ముద్రణ వీటన్నింటికి అవ… సరమైన డబ్బు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రంలో అతున్నత స్థాయి వరకు చట్టం సరిగా అర్థమవ్వాలంటే పుస్తకాలు ముద్రించాల్సి ఉంటుంది. కేవలం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ ఎం) అమలవుతున్న గ్రామాల్లో పంచడానికే 21 వేల కాపీలు కావాలి. ఈ డబ్బెవరిస్తారు?! చట్టం కేంద్రం చేసినా అమలు చేయాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. ఇది మధ్యలో వచ్చిన చట్టం కావడంతో ఆరోగ్య శాఖ బడ్జెట్‌లో దీని కోసం నిధులు కేటాయించలేదు.

అమలులో ఇబ్బందులు

వైద్య విధాన పరిషత్‌ (వీవీపీ), వైద్యవిద్యా శాఖ, పాఠశాల విద్యాశాఖ ఈ చట్టం అమలులో పూర్తిగా వెను కబడ్డాయి. స్వతహాగా ఈ వ్యవహారాల్లో అనుభవమున్న పోలీస్‌, ఔషధ నియంత్రణ సంస్థ, ఐపీఎం తదితర శాఖలు గణీయమైన ఫలితాలు సాధించాయి. పొగపై నిషేధం అమలులో సమస్యలు అధిగమించేందుకు తగిన కార్యాచ రణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ రమేష్‌ చంద్ర `సూర్య' కు తెలిపారు. ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు కొన్ని శాఖలకే ఈ చట్టంపై అవ గాహన కలిగించామని, ఇకపై అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రతీ సంస్థనూ భాగస్వాములను చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఏకాంతంలో సిగరెట్‌ తాగితే... కేన్సర్‌ ఒక్కరికే వస్తుంది .అదే బహిరంగ ప్రదేశాల్లో అయితే పొగరాయుళ్ల కన్నా కూడా ఎక్కువగా అక్కడున్న వారే ఎక్కువగా కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

No comments:

Post a Comment