Friday, January 16, 2009

108, 104 బోర్డుల ప్రక్షాళన ఏది?!


* 95 శాతం ప్రభుత్వ నిధులు... పెత్తనం 'సత్యం' పెద్దలదా?
* ఆడిటింగ్ లో పారదర్శకత లేకుంటే ఎలా?
* పుట్టి మునిగే దాకా వేచి చూసే వైఖరి!

హైదరాబాద్‌, జనవరి 15:
కంపెనీ ఖాతా ల్లో తప్పుడు లెక్కలు చూపి వేల కోట్ల రూపాయలు దండుకు న్నాక గానీ ప్రభుత్వాలు కళ్లు తెరవలేదు. ఇకపై 108, 104 సేవల విషయంలో ఈ సంక్షోభం పునరావృతమవుతుందా?! ఇప్పుడు సత్యం ఉద్యోగులు వీధిన పడకుండా ఉండేందుకు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. మరి సత్యం ఫౌండేషన్‌కు అనుబంధంగా నడుస్తూ 108, 104 సేవలందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ రీసెర్‌‌చ ఇనిస్టిట్యూట్‌ (ఇఎంఆర్‌ఐ), హెల్‌‌త మేనేజ్‌మెంట్‌ రీసెర్‌‌చ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌ఎంఆర్‌ఐ) స్వచ్ఛంద సంస్థల మాటేమిటి?! వీటిలో సత్యం కంప్యూటర్‌‌స నుంచి వచ్చిన వారు, రామలింగరాజుతో సన్నిహిత సంబం ధ బాంధవ్యాలున్న వారే కీలకస్థానాల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం `జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌' (ఎన్‌ఆర్‌హె చ్‌ఎం)ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఇస్తున్న నిధుల్లో సింహభాగం ఈ సంస్థల ఖాతాల్లోకే వెళుతున్నాయి. మరి ఈ ఖాతాల్లోకి వెళుతున్న ప్రజా ధనం సక్రమంగా ఖర్చవుతోందా? లేక దారి మళ్ళుతోందా?. 95శాతం నిధులు ప్రభుత్వం సమ కూర్చుతూ ఈ సంస్థ పాలనా బోర్డు కీలక స్థానాల్లో `సత్యం' వర్గీయులే ఉంటే పారదర్శకత సందేహమే. సత్యంలో తలెత్తిన సంక్షోభంలో 108, 104 సేవలపై పడకుండా ఉండాలంటే `ఇఎంఆర్‌ఐ', `హెచ్‌ఎంఆర్‌ఐ' గవర్నింగ్‌ బోర్డుల ను పునర్వ్య వస్థీకరించాల్సిన అవసరముంది.
`ఇఎంఆర్‌ఐ' బోర్డులో రాలిన స్వతంత్ర వికెట్లు

ప్రజోపయోగ పనులకు 95శాతం ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్న ఈ సంస్థల కీలక పదవుల్లో మాత్రం `సత్యం' హవా ఇప్పటికీ నిరాటంకంగా సాగుతోంది. `సత్యం' సంక్షోభం తదనంతర పరిణామాలను చూశాక కూడా ప్రభుత్వ పెద్దల్లో ఈ అంశమై చలనం లేదు. సంక్షోభం వెలుగు చూసిన కొద్దిరో జులకే `108-ఇఎంఆర్‌ఐ' గవర్నింగ్‌ బోర్డులో ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్ల వికెట్లు పడిపోయాయి. ఒక్కొక్కరుగా ఎటు వంటి ప్రకటనలు చేయకుండా రాజీనామాలు సమర్పించారు. `ఇఎంఆర్‌ఐ' బోర్డుకు గౌరవ చైర్మన్‌గా కొనసాగుతున్న మాజీ రాష్టప్రతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎ.పి.జె అబ్దుల్‌ కలామ్‌ వైదొలిగారు. ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్‌ ఎండీ, సీఇఓ కే.వీ. కామత్‌, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు చెందిన తరుణ్‌ దాస్‌, హార్వర్‌‌డ బిజినెస్‌ స్కూలు పట్టభద్రుడు పి. కృష్ణ, నాస్కామ్‌ మాజీ అధ్యక్షుడు కిరణ్‌ కార్నిక్‌ కూడా తప్పుకు న్నారు. మరో ఐదుగురు డైరెక్టర్లు బోర్డులో మిగిలారు. ఇందులో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ తప్ప మిగిలిన వారు సత్యం కంప్యూ టర్‌‌స, ఆ సంస్థ అధినేత రాజుకు ఏదో ఒక విధంగా సన్నిహితులే. మరి స్వతంత్ర డైరెక్టర్లు లేకుండా `ఇఎంఆర్‌ఐ' పాలన, ఆర్థిక అంశాల్లో పారదర్శకత సాధ్యపడదు. `హెచ్‌ఎంఆర్‌ఐ - 104' కు ఈ సెగ ఇంకా తగల లేదు.

ఖర్చు ప్రభుత్వానికి... పేరు `సత్యానికి'!

108, 104 సేవలకు ప్రభుత్వం 95 శాతం నిధులు సమకూరుస్తున్నా, ఆ సంగతి సాధారణ ప్రజలెవరికీ తెలీదు. సత్యం ఫౌండేషనే ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తోందని భావించే వారే ఎక్కువ. రెండేళ్ల క్రితమే అత్యవసర సేవల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇచ్చినా అంబులెన్సుల మీద ప్రభుత్వ లోగో ముద్రించలేదు. 95శాతం నిధులు ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత నుంచి మాత్రమే (ఏడాది క్రితం) రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లోగోలను 108, 104 వాహనాలపై ముద్రిస్తున్నారు. సరిగ్గా యాజమాన్యం విషయంలో ఇవే సూత్రాలు కొనసాగుతున్నాయి. 108 సేవలు ఇప్పటికే 8 రాషా్టల్రకు విస్తరించాయి. కీలక పదవుల్లో సత్యం వర్గీయులు ఉండడంతో సంస్థలకు వస్తున్న నిధులు పక్కదారి పడితే ఆ ప్రభావం ఈ సారి ప్రజా ప్రయోజనాలపై పడుతుం ది. అలా కాకూడదంటే నిపుణులైన స్వతంత్ర డైరెక్టర్లకు బోర్డులో స్థానం కల్పించాలా? బోర్డునే పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలా? అనే నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. ఇప్పటివరకు ఆడిటింగ్‌ వ్యవహారాలను క్షుణ్ణంగా సమీక్షించి స్వతంత్ర ఆడిటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
5శాతం తగ్గించుకోం : సీఈఓ
అత్యవసర సేవల్లో (108) ఐదు శాతం వాటాను వెనక్కు తీసుకోబోమని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్‌ (ఇఎంఆర్‌ఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ీసీఈఓ) సిహెచ్‌. వెంకట్‌ స్పష్టం చేశారు. `సత్యం' సంక్షోభం తరువాత రామలింగ రాజు ప్రారంభించిన 108 సేవల్లో మీ వంతు పెట్టుబడులు ఉపసంహరించుకుని పూర్తిగా ప్రభుత్వ నిర్వహణకు అప్పగిస్తారా?! అన్న విశ్లేషకుల ప్రశ్నకు ఆయనీ సమాధానం చెప్పారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 108 సేవల్లో ప్రభుత్వం 95 శాతం, సత్యం గ్రూపు 5శాతం పెట్టుబడులు పెట్టేందుకు లాంఛనప్రాయ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 108 సేవలకు యాజమాన్య ఖర్చులు, సాంకేతిక సాయం మాత్రమే సత్యం గ్రూపు నుంచి అందుతున్నాయి. మిగిలిన ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆర్థికంగా వచ్చే లోటును భర్తీ చేసుకునేందుకు విరాళాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. గతంలో ఉన్నట్లే 108 ద్వారా నాణ్యమైన సేవలను ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

No comments:

Post a Comment